ఫైట్ సీన్ కోసం పెద్ద రిస్క్ చేస్తున్న స్టార్ హీరో టీమ్

ఫైట్ సీన్ కోసం పెద్ద రిస్క్ చేస్తున్న స్టార్ హీరో టీమ్

Published on Mar 9, 2020 10:23 AM IST

కరోనా ఎఫెక్ట్ కారణంగా విదేశీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు వాటిని విరమించుకుని ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాయి. కొందరైతే కరోనా ప్రభావం తగ్గాకే విదేశాలకు వెళ్లొచ్చని షూట్ వాయిదా వేసుకుంటున్నారు. కానీ అజిత్ అండ్ టీమ్ మాత్రం ‘వాలిమై’ కోసం ఏప్రిల్, మే నెలలో స్పెయిన్, మొర్రాకో వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. డైరెక్టర్ హెచ్.వినోత్ అజిత్ మీద ఒక భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేసుక్కునారట.

భారీ ఖర్చుతో కూడుకున్న ఈ ఫైట్ సినిమాకు పెద్ద అసెట్ అనే రీతిలో డిజైన్ చేశారట. దాన్ని స్పెయిన్, మొర్రాకోలోని పర్టిక్యులర్ లొకేషన్లలో షూట్ చేయాల్సి ఉందట. అయితే కరోనా మూలాన ఆ షెడ్యూల్ వాయిదా వేయాలని అనుకున్నా ఇప్పుడు మాత్రం వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అజిత్ అండ్ టీమ్ సినిమా కోసం పెద్ద రిస్కే తీసుకుంటున్నారు. ఇకపోతే ఇందులో అజిత్ సరసన హుమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ 2020 వేసవికి విడుదలకానుంది.

తాజా వార్తలు