స్టార్ డైరెక్టర్ శంకర్ – గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ ల కాంబినేషన్ లో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్ భారతీయుడు సినిమాకి సీక్వెల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. మధ్యలో ఆగిపోయినా ఎట్టకేలకూ ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ముగియగానే తర్వాతి షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళ్లనున్నారు.
కాగా కాజల్ అగర్వాల్ కూడా ఆ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొనబోతుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ లేట్ అవ్వడంతో టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఆమెది భారతీయుడు సీక్వెల్ లో ముఖ్య పాత్ర అట. అందుకే ఆమె పాత్రలో ‘గ్యాంగ్ లీడర్ బ్యూటీ’ ప్రియాంకా అరుళ్ మోహన్ ను తీసుకున్నారట.
సినీ వర్గాల సమాచారం ప్రకారం వచ్చే షెడ్యూల్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా షూట్ లో పాల్గొంటుందట. ఈ చిత్రంలోకాజల్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా నటించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భవాని కూడా భారతీయుడు సీక్వెల్ లో కీలకమైన పాత్రల్లో నటించబోతున్నారు.