మహేష్ – సుకుమార్ సినిమా టైటిల్ ఇదేనా?

మహేష్ – సుకుమార్ సినిమా టైటిల్ ఇదేనా?

Published on Nov 16, 2012 4:10 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకి చంద్రుడు, ఆచార్య, ఆగడు అంటూ చాలా టైటిల్స్ ప్రచారంలో జరుగుతుండగా ఇవేవి కావని ప్రొడక్షన్ టీం ధ్రువీకరించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ‘తుంటరి’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ దీనిని యూనిట్ వర్గాలు ఇంకా ధ్రువీకరించలేదు. ఈ టైటిల్ అయితే బావుంటుందని కొందరు మహేష్ ఫాన్స్ అంటుంటే కొందరు మాత్రం అస్సలు బాలేదని అంటున్నారు. గతంలో ఖలేజా టైటిల్ విషయంలో చేసిన తప్పు మళ్లీ జరగకుండా చూసుకోవాలని మహేష్ భావిస్తున్నాడు. ఏది ఏమైనా ప్రొడక్షన్ టీం ఏది ఖరారు చేస్తే అదే ఫైనల్ అవుతుంది.

తాజా వార్తలు