తిక్క చూపించనున్న శ్రీహరి – పోసాని

తిక్క చూపించనున్న శ్రీహరి – పోసాని

Published on Nov 16, 2012 12:46 PM IST


రియల్ స్టార్ శ్రీహరి, పోసాని కృష్ణ మురళి మరియు ప్రియమణి ప్రాధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘తిక్క’. భరణి మినరల్స్ బ్యానర్ పై బి.ఆర్ దుగ్గినేని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు పాటలు మరియు మిగతా కొన్ని సన్నివేశాల మినహా మిగతా చిత్రీకరణ పూరతయ్యింది. మిగిలిన చిత్రీకరణ 22 లోపు పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలైన ఈ సినిమాని తెలుగు మరియు కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు. రాజీవ్ కనకాల, శివా రెడ్డి, తాగుబోతు రమేష్ మరియు జీవా తదితరులు మిగతా పాత్రల్లో కనిపించనున్నారు. రమణ గోగుల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీహరి మరియు పోసాని కామెడి చేయనున్నారు. వారిద్దరి లోని కామెడీ యాంగిల్ చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యుంటాడని ఆశిస్తున్నాం.

తాజా వార్తలు