ఫ్లైట్ లో నుంచి దూకేసిన హరీష్ శంకర్.!

ఫ్లైట్ లో నుంచి దూకేసిన హరీష్ శంకర్.!

Published on Nov 16, 2012 11:27 AM IST


2012 లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఒక్కసారిగా విమానంలో నుంచి దూకేశారు. ఏంటి సడన్ గా ఏమైంది అలా ఎలా దూకేశాడు అని అనుకుంటున్నారా? మన హరీష్ శంకర్ స్కై డైవ్ చేసాడు అంతే. లండన్ శివార్లలోని స్విమ్ డన్ ప్రాంతంలో హరీష్ శంకర్ విమానం నుంచి జంప్ చేసారు. ‘నేను స్కై డైవ్ చేసాను. చాలా థ్రిల్లింగ్ గా అనిపించిందని’ ట్వీట్ చేసారు. హరీష్ శంకర్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కనుంది.

తాజా వార్తలు