అక్కినేని వారి వారసుడిగా తెలుగు వారికి పరిచయమైన సుశాంత్ హీరోగా నిలబడటానికి తన వంతు ప్రయత్నం తను చేస్తూ ఉన్నప్పటికీ కమర్షియల్ గా హిట్ మాత్రం అందుకోలేకపోయారు. ఈ సారైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో మూడవ ప్రయత్నంగా ‘అడ్డా’ అనే సినిమాతో సుశాంత్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతుంది. సినిమా ప్రోగ్రెస్ తెలియజేయడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ‘ సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వస్తోంది మరియు సినిమా కోసం పనిచేసే 24 క్రాఫ్ట్స్ లోనూ అందరినీ ఉత్తమమైన వారే ఈ సినిమాకి తీసుకున్నాము. అందరం ఒక టీంగా కలిసి ఎంతో కస్ష్టపడి సినిమా కోసం పనిచేస్తున్నాం. సినిమాలో ఇది బాలేదు, అక్కడ వీక్ గా ఉంది అని చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అంతలా స్క్రిప్ట్ ని తయారు చేసుకున్నాం. మరో రెండు రోజుల్లో టాకీ పార్ట్ పూర్తవుతుంది మిగిలి ఉన్న రెండు పాటలను స్విట్జర్లాండ్లో తీయాలని ప్లాన్ చేస్తున్నాం. డిసెంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టి డిసెంబర్ చివరిలోపు సినిమాని విడుదల చేయాలనుకుంటున్నామని’ ఈ ప్రెస్ మీట్లో తెలిపారు.
ఈ ప్రెస్ మీట్లో హీరో సుశాంత్, డైరెక్టర్ జి. సాయి కార్తీక్, నటుడు కోట శ్రీనివాసరావు మరియు నిర్మాతలు శ్రీనివాసరావు – నాగ సుశీల పాల్గొన్నారు. సుశాంత్ సరసన ‘లవ్లీ’ ఫేం శాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.