మళ్లీ మెగా ఫోన్ పట్టుకోబోతున్న నాజర్

మళ్లీ మెగా ఫోన్ పట్టుకోబోతున్న నాజర్

Published on Nov 15, 2012 4:46 PM IST


తమిళ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ తెలుగులోనూ చాల సినిమాల్లో నటించాడు. అయన త్వరలో ఒక సినిమాకి డైరెక్షన్ చేయబోతున్నాడు. 1995లో అవతారం అనే సినిమాకి డైరెక్షన్ చేసిన ఆయన దేవతై, మాయన్, చివరగా 2003లో పాప్ కార్న్ అనే సినిమాతో డైరెక్షన్ ఆపేసారు. త్వరలో ‘సన్ సన్ తాతా’ అనే సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాతో నాజర్ కొడుకుని హీరోగా పరిచయం చేయబోతున్నాడు. మలేషియా బ్యాక్ డ్రాప్లో సాగే ఈ సినిమాని నాజర్ భార్య కమీలా నిర్మించనుంది. బిజినెస్, ఉద్యోగం అంటూ పిల్లల ఆలనాపాలన చూసుకోకుండా వెళ్ళిపోయే తల్లుతండ్రుల మీద ఈ సినిమా తీయబోతున్నట్లు సమాచారం.

తాజా వార్తలు