భారతీయ సినీ ఖ్యాతిని తన సంగీతం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పి ఆస్కార్ అవార్డు అందుకున్న నాల్గవ ఇండియన్ ఎ.ఆర్ రెహమాన్. అలాంటి రెహమాన్ ఇప్పటి వరకూ హిందీ, తమిళ, తెలుగు మరియు ఇంగ్లీష్ సినిమాలకు సంగీతం అందించినా, తన కెరీర్లో చేసిన సొంత మ్యూజిక్ ఆల్బమ్ మాత్రం ఒకేఒక్కటి అదే ‘వందే మాతరం’. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1997లో ఈ ఆల్బమ్ విడుదల చేసారు. ఈ ఆల్బమ్ విడుదలయ్యి 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎ.ఆర్ రెహమాన్ తన సంతోస్తాన్ని పంచుకున్నారు, అలాగే తన అభిమానులకు ఒక ప్రశ్నను ఇచ్చారు. ‘ నేను కంపోస్ చేసిన వందే మాతరం ఆల్బమ్ వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ తర్వాత నేను సినిమాలతో బిజీ అయిపోవడం వల్ల మరో ఆల్బమ్ చేసే టైం లేకుండా పోయింది. కానీ అలాంటి ఆల్బమ్స్ చేయడం ఒక చాలెంజ్ లా అనిపిస్తుంది. నా సెకండ్ ఆల్బమ్ చేయాల్సిన సమయం ఇదేనా?’ అని ట్వీట్ చేసారు.
ఇది చూస్తుంటే ఈ విషయంపై ఆయన అభిమానుల అభిప్రాయం ఏమిటా అని తెలుసుకోవడానికి చేసినట్టు ఉంది. మరి ఆలస్యమెందుకు ఫ్రెండ్స్ మనం ఎ.ఆర్ రెహమాన్ ఆల్బం కోసం ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నామో అన్న విషయాన్ని ఆయనకి తెలియజేయండి. అది చూసి ఆయన మరో ఆల్బమ్ కి శ్రీకారం చుడతారేమో చూద్దాం.