ఈ దీపావళి రోజు తమన్నా ఏమిచేయనుంది?

ఈ దీపావళి రోజు తమన్నా ఏమిచేయనుంది?

Published on Nov 13, 2012 10:51 AM IST

ముందుగా 123తెలుగు.కామ్ పాఠకులకు ‘దీపావళి’ శుభాకాంక్షలు. ప్రపంచంలోని ప్రతిఒక్క భారతీయుడు ఎంతో ఆనందంతో జరుపుకునే పండుగ ‘దీపావళి’.

మిల్క్ బ్యూటీ తమన్నా ఈ దీపావళి రోజు తను ఎలాగడుపుతుందో అని ఆమె తెలిపారు. ‘ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ ఫెస్టివల్ కోసం కొంత విరామం తీసుకున్నాను. ఎప్పటిలానే ఈ దీపావళిని కూడా ముంబై లోని మా ఇంట్లోనే జరుపుకుంటున్నాను. దీపావళి అంటే సందడి మొత్తం నాదే ఉంటుంది. ఎందుకంటే అమ్మా పూజలో ఉండిపోతారు నాన్నేమో పండుగ ఏర్పాట్లలో బిజీ కావున ఇక ఇంటికి వచ్చే ఫ్రెండ్స్, బంధువులతో సందడంతా నాదే ఉంటుంది. ఇక క్రాకర్స్ విషయానికొస్తే పెద్దగా శబ్దాలు వచ్చే వాటిని కాల్చను చిన్న చిన్న వాటితో బాగా ఎంజాయ్ చేస్తాను’ అని అన్నారు. తనని అభిమానిచే వారికి ఈ దీపావళిని ఎంతో ఆనందంగా, గుర్తుండిపోయేలా మరియు జాగ్రత్తగా చేసుకోమని తెలిపారు.

తాజా వార్తలు