చెన్నై వెళ్ళిన “గౌరవం”

చెన్నై వెళ్ళిన “గౌరవం”

Published on Nov 3, 2012 2:29 PM IST

రాధా మోహన్ దర్శకత్వంలో అల్లు శిరీష్ ని హీరోగా పరిచయం చేస్తూ వస్తున్న చిత్రం “గౌరవం” ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్ కోసం చెన్నై పయనమయ్యింది ఈ చిత్ర చివరి షెడ్యూల్ చిత్రీకరణ ఈరోజు టి.నగర్లో మొదలు పెట్టుకుంది. అల్లు శిరీష్ సరసన యామి గౌతం నటిస్తున్నారు. శ్రీ చరణ్ మరియు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “గౌరవం” చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు తమిళంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రతిభ కన్నా కులాలకు ఎక్కువగా ప్రాదాన్యత ఇస్తున్నారు అన్న అంశం చుట్టూ తిరుగుతుంది. ఇంకా ఈ చిత్ర కథ మీద ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు ప్రకాష్ రాజ్ ఈ చిత్రాన్ని డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2013లో విడుదల కానుంది.

తాజా వార్తలు