మంచి పని చేసినా అరెస్టు చేసారు.!

మంచి పని చేసినా అరెస్టు చేసారు.!

Published on Oct 8, 2012 6:45 PM IST


‘కింగ్’ నాగార్జున భార్య అయిన శ్రీమతి అక్కినేని అమల అరెస్టయ్యారు. ఈ రోజు గ్రీన్ పీస్ ప్రొటెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న అమలని చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేసారు. అమల మరియు గ్రీన్ పీస్ కమిటీ సభ్యులు కలిసి కోల్ మైనింగ్ మరియు అటవీ నిర్మూలన మీద బానర్లు పట్టుకొని చార్మినార్ ముందు అవగాహన సదస్సు నిర్వహించారు. అక్కడ అరెస్టు చేసిన అమలని వెంటనే బెయిల్ పై విడుదల చేసారు. అమల సమయం దొరికినప్పుడల్లా జంతు సంరక్షణ మీద మరియు పర్యావరణ సంరక్షణ అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు.

తాజా వార్తలు