భాస్కర్ చిత్రం కోసం తణుకు వెళ్లనున్న రామ్

భాస్కర్ చిత్రం కోసం తణుకు వెళ్లనున్న రామ్

Published on Oct 6, 2012 3:09 PM IST

భాస్కర్ దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న చిత్రంలో మరో షెడ్యూల్ కోసం రామ్ సిద్దమయ్యారు. ఈ షెడ్యూల్ తణుకులో జరగనుంది దాదాపుగా చిత్రంలో చాలా భాగం ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారు. రామ్ మరియు కృతి కర్భంద ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం చాలా వరకు గుంటూరు మరియు తణుకు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ లు మారారు మొదట శుభ పుతేలను తీసుకోగా తరువాత ఆమె స్థానంలో నికితని తీసుకున్నారు తాజాగా ఆమెను తప్పించి కృతి కర్భందని తీసుకున్నారు. కృతి కర్భంద చివరగా “మిస్టర్ నూకయ్య” చిత్రంలో నటించారు. ఈ చిత్ర పేరుని త్వరలో ప్రకటించనున్నారు.

తాజా వార్తలు