సాయి రామ్ శంకర్ తో కలిసి వెయ్యి అబద్దాలు ఆడబోతున్న తేజ

సాయి రామ్ శంకర్ తో కలిసి వెయ్యి అబద్దాలు ఆడబోతున్న తేజ

Published on Oct 4, 2012 5:00 PM IST


ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించడంలో సరికొత్త పంథాను చూపించిన దర్శకుడు తేజ. “చిత్రం”,”నువ్వు నేను” మరియు “జయం” వంటి చిత్రాలతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న తేజ తరువాత కాస్త తడబడ్డాడు. “జయం” చిత్రం తరువాత విజయం రుచి చూడని ఈ దర్శకుడు చివరగా “నీకు నాకు” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయం సాదించలేకపోయింది తాజాగా ఈ దర్శకుడు మరో చిత్రం చెయ్యబోతున్నారు, పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ హీరోగా రాబోతున్న ఈ చిత్రం కోసం తేజ “వెయ్యి అబద్దాలు” అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ – ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 18న అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రం లో కథానాయికను ఇంకా ఎంపిక చెయ్యలేదు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలను త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు