“మున్నా” మరియు “బృందావనం” వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన వంశీ పైడిపల్లి ఈరోజు తనకు ఎటువంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఎకౌంటులు లేవని దృవీకరించారు. తన పేరు మీద నకిలీ ఎకౌంటు లు సృష్టించారని తెలుసుకున్న వంశీ ముందు ఆశ్చర్యానికి గురయ్యారు ఈ విషయం గురించి చెప్తూ ” కొన్నాళ్ళ క్రితం ఒకరు ఫోన్ చేసి వాళ్ళు ఫోటో షూట్ చేశామని తెలిపారు ఏంటని అడిగితే పేస్ బుక్ లో వాళ్ళతో సంభాషణ జరిపామని అంటున్నారు.అందులో ఫోటో షూట్ చెయ్యమని నేను చెప్పానని అన్నారు. ఈ మధ్యన మరొక కథానాయిక ఫోన్ చేసి తనకి అసభ్య కరమయిన మెసేజ్ లు ఎందుకు పంపుతున్నావు అని అడిగింది అప్పుడు నాకు అర్ధం అయ్యింది ఎవరో నా పేరు ఉపయోగించి ఇదంతా చేస్తున్నారు అని. నా టీం ఆ ఎకౌంటు సృష్టించిన వాళ్ళని ఎకౌంటు డిలీట్ చెయ్యమని అడిగారు కూడా చెయ్యకపోగా వాళ్ళు నా టీంని అసభ్యకరంగా మాట్లాడటం మొదలు పెట్టారు అందుకే నేను ఫిర్యాదు చెయ్యడానికి వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను నాకు ఎటువంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎకౌంటులు లేవు” అని అన్నారు. గతంలో ఇలా నయనతార మరియు ఇంకొందరు ప్రముఖుల పేర్ల మీద ఎకౌంటులు సృష్టించారు వారు కూడా ఇలానే పోలీసు ఫిర్యాదు చేశారు.
నాకు ఎటువంటి ఎకౌంటు లేదు – వంశీ పైడిపల్లి
నాకు ఎటువంటి ఎకౌంటు లేదు – వంశీ పైడిపల్లి
Published on Oct 4, 2012 5:03 PM IST
సంబంధిత సమాచారం
- హీరో విశాల్ ఎంగేజ్మెంట్.. పుట్టినరోజే గుడ్ న్యూస్ షేర్ చేసాడుగా
- చిరు కోసం సైకిల్ యాత్ర చేసిన మహిళా వీరాభిమాని.. మెగాస్టార్ భరోసా
- హిస్టరీ క్రియేట్ చేసిన రామ్ సింపుల్ పోస్ట్!
- తెలుగులో దుల్కర్ ‘కొత్త లోక’ మార్నింగ్ షోస్ క్యాన్సిల్!
- స్ట్రాంగ్ బజ్: ‘ఓజి’ కోసం పవన్ మరోసారి!?
- ట్రైలర్ తర్వాత ‘మిరాయ్’ పై మరిన్ని అంచనాలు!
- ‘ఓజి’ ఫీవర్.. యూఎస్ మార్కెట్ ని టేకోవర్ చేస్తున్న పవర్ స్టార్!
- ‘విశ్వంభర’ కోసం ఈ ఓటీటీ సంస్థ?
- ఘట్టమనేని హీరో కోసం విలన్‌గా మారిన మోహన్ బాబు..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- ‘మాస్ జాతర’ రిలీజ్ పై లేటెస్ట్ బజ్!
- ‘ఓజి’: ఈ విషయంలో కూడా స్పీడ్ పెంచాల్సిందేనా!
- ‘బిగ్ బాస్ 9’: మొత్తానికి కొత్త సీజన్ లాంచ్ డేట్ వచ్చేసింది!
- అఫీషియల్: ‘ది రాజా సాబ్’ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ వచ్చేసింది!
- బాలయ్య సినిమా లేనట్టేనా?
- అఖండ 2 తప్పుకోవడంతో సింగిల్‌గా దిగుతున్న ఓజి.. ఇక రికార్డులు గల్లంతే..!
- వీడియో : మిరాయ్ ట్రైలర్ (తేజ సజ్జా, మంచు మనోజ్)