నాగార్జున సినిమాకి అడ్డుపడుతున్న డబ్బింగ్ సినిమా

నాగార్జున సినిమాకి అడ్డుపడుతున్న డబ్బింగ్ సినిమా

Published on Oct 3, 2012 6:00 PM IST


తమిళ స్టార్ సూర్య “బ్రదర్స్” చిత్రం అక్కినేని నాగార్జున “డమరుకం” చిత్రంతో పోటీపడనుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల విడుదల తేదీల ప్రకారం అక్కినేని నాగార్జున సోషియో ఫాంటసి చిత్రం “డమరుకం” అక్టోబర్ 11న రానుండగా సూర్య “బ్రదర్స్” చిత్రం అక్టోబర్ 12న రానుంది. “బ్రదర్స్” చిత్రంలో సూర్య అవిభక్త కవలల పాత్రలలో కనిపించనున్నారు. గత కొన్నేళ్ళుగా తెలుగు పరిశ్రమలో పెద్ద హీరోలతో సమానంగా సూర్య చిత్రం వసూళ్లు రాబట్టుతుంది. ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్ చిత్రాలే కాకుండా సాంకేతిక అంశాలను పుష్కలంగా ఉన్న చిత్రాలు అందులో “డమరుకం” గ్రాఫిక్స్ తో ముడిపడినందున ప్రేక్షకులు ఈ చిత్రం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ వారాంతానికి ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాదిస్తుందో కాలమే చెబుతుంది.

తాజా వార్తలు