మహేష్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఈమేనా?

మహేష్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్ ఈమేనా?

Published on Oct 3, 2012 7:12 PM IST


మీరు పైన ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు కృతి సనన్. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కథానాయికగా నటించనుంది. ఈ సినిమాలో ముందుగా అనుకున్న కాజల్ అగర్వాల్ స్థానంలో ఈ అమ్మాయిని తీసుకున్నారు. గత కొంత కాలంగా కృతి సనన్ తన మొదటి సినిమా కోసం శిక్షణ పొందుతోందని సమాచారం.

స్వతహాగా మోడల్ అయిన ఈ అమ్మాయి చాలా టీవీ కమర్షియల్ ప్రకటనల్లో నటించింది. ఈ భామ చూడటానికి చాలా మామూలుగా ఉంది, అలాగే చాలా స్టైలిష్ గా కూడా ఉంది. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ త్వరలోనే గోవాలో ప్రారంభం కానుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం దగ్గర నుంచి ఈ విషయం గురించి ఖచ్చితమైన సమాచారం కోసం ట్రై చేస్తున్నాం, తెలియగానే పూర్తి వివరాలు తెలియజేస్తాం.

తాజా వార్తలు