గోవా నుండి బ్యాంకాక్ వెళ్లనున్న యాక్షన్ టీం

గోవా నుండి బ్యాంకాక్ వెళ్లనున్న యాక్షన్ టీం

Published on Oct 3, 2012 4:12 PM IST


‘దూకుడు’ సినిమా నిర్మాతలో ఒకరైన అనిల్ సుంకర దర్శకుడిగా పరిచయమవుతూ చేస్తున్న ద్విభాషా చిత్రం ‘యాక్షన్ 3డి’. విత్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రస్తుతం గోవాలో ప్రీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 19 నుంచి జరగబోయే తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లో అల్లరి నరేష్, వైభవ్ రెడ్డి, రాజు సుందరం, ‘కిక్’ శ్యాం, స్నేహ ఉల్లాల్, కామ్న జఠ్మలాని మరియు నీలం ఉపాధ్యాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో వస్తున్న మొదటి 3డి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అనిల్ సుంకర చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. బప్ప లహరి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బప్పి లహరి నేపధ్య సంగీతమందిస్తున్నారు, సర్వేశ్ మురారి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

తాజా వార్తలు