కృష్ణం వందే జగద్గురుమ్ ఆడియో విడుదల వాయిదా

కృష్ణం వందే జగద్గురుమ్ ఆడియో విడుదల వాయిదా

Published on Oct 2, 2012 7:00 PM IST


క్రిష్ డైరెక్షన్లో రానా హీరోగా తెరకెక్కుతున్న కృష్ణం వందే జగద్గురుమ్ చిత్ర ఆడియో ఈ నెల 3న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ చిత్ర ఆడియో విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాత ప్రకటించారు. వేదిక నిర్ణయించిన తరువాత ఈ వారాంతానికి ఆడియో విడుదల చేయనున్నట్లు సమాచారం. రానా సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి జాగర్లమూడి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు