ఆ చాన్స్ నాకు వస్తే రెచ్చిపోతా.!

ఆ చాన్స్ నాకు వస్తే రెచ్చిపోతా.!

Published on Oct 2, 2012 2:49 PM IST


‘వేదం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పొడుగు కాళ్ళ సుందరి దీక్షా సేథ్. తెలుగు మరియు తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నా దీక్షా సేథ్ కి మాత్రం చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ మాత్రం లేదు. ఆమె నటించిన ఒక్క ‘మిరపకాయ్’ చిత్రం మాత్రం బాక్స్ ఆఫీసు దగ్గర విజయాన్ని అందుకుంది. చూడటానికి ఎంతో గ్లామరస్ గా ఉండే ఈ భామని మీరు గ్లామరస్ పాత్రలే ఎందుకు ఎంచుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ ‘ నటనకి బాగా ఆస్కారమున్న పాత్రలు మన దగ్గరికి వస్తేనే కదా చేస్తాం. మొదట్లో అందరి హీరోయిన్లకి గ్లామరస్ పాత్రలే వస్తాయి, కాబట్టి నాకూ అలానే వస్తున్నాయి. ‘అరుంధతి’ చిత్రం వచ్చేంత వరకూ అనుష్క అంత బాగా నటించగలదని ఎవ్వరికీ తెలియదు, అలాగే ‘జబ్ వుయ్ మెట్’ సినిమా వచ్చే వరకూ కరీనాలో నటన అనే యాంగిల్ ని ఎవరూ చూడలేదు. అలాంటి పాత్రలు చేయగలనని దర్శకుడు నమ్మి అలాంటి కథలతో వస్తే నేను కూడా రెచ్చిపోతా’ అని ఆమె అన్నారు. దీక్షా సేథ్ ప్రభాస్ సరసన ఒక కీలక పాత్రలో నటించిన ‘రెబల్’ సినిమా విడుదలై బాక్స్ ఆఫీసు దగ్గర మంచి కలెక్షన్లతో ముందుకెలుతోంది. దీక్షా సేథ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసి ఎవరన్నా అలాంటి పాత్రలతో కథ తీసుకెల్తారేమో చూద్దాం.

తాజా వార్తలు