‘ఈగ’ మీద ఆ బాలీవుడ్ జంటకి ఎందుకంత మమకారం?

‘ఈగ’ మీద ఆ బాలీవుడ్ జంటకి ఎందుకంత మమకారం?

Published on Oct 2, 2012 1:00 PM IST


టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం హిందీ వెర్షన్ ‘మక్కీ’లో బాలీవుడ్ అందాల భామ కాజోల్ భర్త అయిన అజయ్ దేవగన్ కూడా ఒక భాగమయ్యారు. ఈ చిత్రం మొదట్లో తన కూతురికి ‘మక్కీ’ కథ చెప్పే తండ్రి పాత్రకి అజయ్ దేవగన్ వాయిస్ అందించడానికి అంగీకరించారు. అజయ్ దేవగన్ బాటలోనే కాజోల్ కూడా మొదట్లో వచ్చే తల్లి పాత్రకి తన వాయిస్ అందించనున్నారు. ఇంతకీ ఈ బాలీవుడ్ జంటకి ఎందుకు ‘ఈగ’ మీద ఇంత అభిమానం చూపిస్తున్నారంటే, ఇప్పటికే రాజమౌళి ‘ఈగ’ సినిమాని ఈ జంటకి చూపించారు. సినిమా వారికి బాగా నచ్చేయడంతో వారే ఆసక్తితో డబ్బింగ్ చెప్పడానికి ముందుకొచ్చారు.

ఈ చూడముచ్చటైన జంట వాయిస్ అందించడం చాలా సంతోషంగా ఉందని ఎస్.ఎస్ రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.’ అజయ్ దేవగన్ తన వాయిస్ అందిస్తున్నందుకు నా ధన్యవాదాలు. తల్లి పాత్రకి కాజోల్ వాయిస్ అందించనున్నారు అని తెలియజేయడంతో చాలా సంతోషంగా ఉంది. ‘మక్కీ’ కి మంచి ప్రారంభం లబిస్తుందని’ ఆయన ట్వీట్ చేసారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఘన విజయం సాదించిన ‘ఈగ’ చిత్రం ‘మక్కీ’ పేరుతో ఈ నెల 12న హిందీలో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాతలు హిందీలో కూడా మంచి విజయం అందుకుంటుందని ఆశిస్తున్నారు.

తాజా వార్తలు