ప్రత్యేకం : పవన్ కళ్యాణ్ ‘రాంబాబు’ సినిమా పుకార్ల వెనకున్న నిజం

ప్రత్యేకం : పవన్ కళ్యాణ్ ‘రాంబాబు’ సినిమా పుకార్ల వెనకున్న నిజం

Published on Oct 1, 2012 7:20 PM IST


గత కొన్ని రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం గురించి కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అవి ఏమిటంటే ఈ చిత్రం గురించి పూరి జగన్నాథ్ సరైన జాగ్రత్తలు తీసుకోలేదని, మరికొందరు పవన్ కళ్యాణ్ గారే సినిమా పై అంత ఆసక్తిగాలేరనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇందులో ఎంత నిజం ఉందా అని మేము ఆరా తీయగా మాకు కొన్ని ఆసక్తి కరమైన విషయాలు తెలిసాయి.

మేము మీకందించే సమాచారం ఇండస్ట్రీలోని విశ్వసనీయ వర్గాల నుండి అందినది. ఈ చిత్ర రైట్స్ దక్కించుకోలేక పోయిన కొంత మంది ఇలాంటి పుకార్లు చేస్తున్నారని సమాచారం. ఇండస్ట్రీలోని ఒక సీనియర్ వ్యక్తి నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్ర డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కి చాలా పెద్ద ఎత్తున పోటీ జరిగింది. ఈ పోటీలో రైట్స్ దక్కించుకోలేని కొంతమంది ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారని తెలియజేశారు.

ఈ చిత్రం ఫై పూరి జగన్నాథ్ మరియు పవన్ కళ్యాణ్ 100% నమ్మకంతో ఉన్నారని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం తెలియజేశారు. అలాగే ఇలాంటి గాలి వార్తలని నమ్మవద్దని అభిమానులకు మరియు సినిమా అభిమానులకు తెలియజేశారు. ఇంతక ముందు నిర్మాత డి.వి.వి దానయ్యకి మరియు పూరికి మధ్య చిన్న అభిప్రాయ బేధం ఉండేదని, ఇప్పుడు అది తొలగిపోయి ఎంతో స్నేహపూరితంగా ఉన్నారని తెలియజేశారు.

శ్రోతలూ ఇదండీ అసలైన వాస్తవం. ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రం భారీ ఎత్తున అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పై పవన్ అభిమానులకు భారీగా అంచనాలు నెలకొన్నాయి.

తాజా వార్తలు