ఆ పాత్ర నాకు రానందుకు అసూయ పడ్డాను : ఎ.ఎన్.ఆర్

ఆ పాత్ర నాకు రానందుకు అసూయ పడ్డాను : ఎ.ఎన్.ఆర్

Published on Sep 30, 2012 7:57 AM IST


‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ కామెడీ హీరోగానే కాక నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేయడంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘ఓనమాలు’. ప్రతి సంవత్సరం అక్కినేని నాగేశ్వర రావు గారి జన్మదిన సందర్భంగా ఇచ్చే ‘అక్కినేని అభినందన’ అవార్డు వేడుక నిన్న హైదరాబాద్లో జరిగింది. ఈ సంవత్సరం ఈ అవార్డును రాజేంద్ర ప్రసాద్ కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఎన్.ఆర్ మాట్లాడుతూ ‘ యు.ఎస్ నుంచి రాగానే స్పెషల్ గా ‘ఓనమాలు’ సినిమా చూసాను. ఆ సినిమా చూస్తున్నంత సేపు రాజేంద్ర ప్రసాద్ మీద అసూయ కలిగింది. ఆ పాత్ర నేను కూడా చెయ్యొచ్చు కానీ నాకెందుకు అలాంటి పాత్ర రాలేదా అని అనుకున్నాను. ‘ఆ నలుగురు’, ‘మీ శ్రేయోభిలాషి’ మరియు ‘ ఓనమాలు’ లాంటి మనసుకు హాత్తుకునే సినిమాలు చేస్తూ ఉండటం చూసి ఇంత మంచి మంచి పాత్రలన్నీ రాజేంద్ర ప్రసాద్ చేస్తున్నాడేమిటా అనుకున్నాను కానీ ఆ పాత్రలకి ఆయన పూర్తి న్యాయం చేస్తున్నాడు కాబట్టే ఆ పాత్రలు ఆయన్ని వరిస్తున్నాయి. ఒక నటుడు మరో నటున్ని చూసి అసూయ పడ్డాడు అంటే అతన్నిపరోక్షంగా గొప్ప నటుడిగా పొగిడినట్టే’ అని ఆయన అన్నారు. మంత్రి గీతా రెడ్డి ముఖ్య అతిదిగా విచ్చేసిన ఈ వేడుకలో ఈ చిత్రానికి పనిచేసిన క్రాంతి మాధవ్, తమ్ముడు సత్యం, హరి అనుమోలు, సిరివెన్నెల సీతారామశాస్త్రి, కోటి మొదలైన వారికి కూడా అవార్డులను అందజేశారు.

తాజా వార్తలు