చిలుకూరు బాలాజీ నేపధ్యంలో రానున్న “చిలుకూరు బాలాజీ”

చిలుకూరు బాలాజీ నేపధ్యంలో రానున్న “చిలుకూరు బాలాజీ”

Published on Sep 27, 2012 8:51 AM IST


వీసా వెంకటేశ్వర స్వామిగా బాగా ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ మీద ఒక చిత్రం తెరకెక్కుతుంది. “చిలుకూరు బాలాజీ” అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అల్లాణి శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. యువతరం ఎక్కువగా కనిపించే చిలుకూరు గుడి మీద చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం కాబట్టి ఇది యూత్ ఫుల్ డివోషనల్ చిత్రం అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రంలో చిలుకూరు బాలాజీ పాత్రలో సునీల్ కనిపిస్తుండగా తిరుమలోలో తప్ప మరెక్కడా పాడని తిరుమలదాసు పాత్రలో ఎస్పి బాలసుబ్రమణ్యం కనిపించనున్నారు. సుమన్, సాయి కుమార్ మరియు భాను శ్రీ మెహ్రాలు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

తాజా వార్తలు