యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రెబల్’ సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సరికొత్త ఘనత దక్కించుకోనుంది. పంజాబ్ రాష్టంలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘రెబల్’. ఈ సినిమా రేపు జలంధర్ లోని బిగ్ సినిమాస్ వివ మల్టీప్లెక్స్ లో విడుదల కానుంది. దీనివల్ల మన మార్కెట్ పరిధి పెరుగుతుంది కనుక ఇది మన ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంతో శుభ సూచకం అని చెప్పుకోవాలి. ఇదివరకే మన తెలుగు సినిమాలు చండీఘర్ లో విడుదల చేసారు కానీ ఇది కేంద్ర పాలిత ప్రాంతం అలాగే పంజాబ్ మరియు హర్యానాకి ఉమ్మడి రాజధాని, అందువల్ల డైరెక్ట్ గా పంజాబ్ రాష్ట్రంలో విడుదలవుతున్న తొలి తెలుగు సినిమా ‘రెబల్’.
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న ఈ చిత్రానికి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ప్రభాస్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. తమన్నా మరియు దీక్షాసేథ్ ఇందులో కథానాయికలు. ‘డార్లింగ్’ మరియు ‘Mr పర్ ఫెక్ట్’ చిత్రాలతో హిట్ కొట్టిన ప్రభాస్ ‘రెబల్’ చిత్రంతో బాక్స్ ఆఫీసు వద్ద హట్రిక్ కొడతాడని అందరూ భావిస్తున్నారు.