‘రెబల్’ ఇండియా ప్రింట్స్ స్టేటస్

‘రెబల్’ ఇండియా ప్రింట్స్ స్టేటస్

Published on Sep 27, 2012 1:25 PM IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘రెబల్’ మూవీకి సంబందించిన సాదారణ ప్రింట్లు మరియు డిజిటల్ డిస్కులు ఈ రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో బయలుదేరనున్నాయి. ఓవర్సీస్ కి సంబందించిన ప్రింట్లు నిన్న రాత్రే బయలుదేరాయి.

భారీ అంచనాలా నడుమ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రేపు విడుదల కానుంది మరియు ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రెబల్. ఈ చిత్ర బడ్జెట్ 40 కోట్ల మార్క్ దాటిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా కథానాయికగా నటించారు.

‘రెబల్’ సినిమాలో రెబల్ స్టార్ కృష్ణం రాజు మరియు దీక్షాసేథ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె. భగవాన్ మరియు జె. పుల్లారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజా వార్తలు