సూర్య సరసన ఐటం సాంగ్ చెయ్యనున్న శ్రియ?

సూర్య సరసన ఐటం సాంగ్ చెయ్యనున్న శ్రియ?

Published on Sep 26, 2012 4:40 PM IST


సూర్య రాబోతున్న చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం “సింగం” చిత్రానికి సీక్వెల్ అయిన “సింగం 2” చిత్రంలో శ్రియ ఐటం సాంగ్ లో కనిపించనుందని సమాచారం. ఈ మధ్యనే శేఖర్ కమ్ముల “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో తలుక్కున మెరిసిన శ్రియ సురయతో ఒక ప్రత్యేక పాటలో నృత్యం చేయ్యనుందని సమాచారం. అనుష్క మరియు హన్సిక మోత్వాని ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పాట లో నృత్యం చెయ్యడానికి ఇప్పటికే శ్రీయని సంప్రదించినట్టు తెలుస్తుంది ఒకవేళ కాల్స్జ్హీట్లు కుదరకపోతే నయనతార ఈ ప్రత్యేక పాటకి డాన్స్ చేసే అవకాశం ఉంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్నారు. “సింగం” చిత్రాన్ని తెలుగులో “యముడు”గా అనువదించారు ఇక్కడ ఈ చిత్రం విశేష ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ చిత్ర బృందం మళ్ళి జతకట్టడం ఆసక్తికరం. “సింగం 2” చిత్రం తెలుగులో కూడా 2013లో విడుదల చేయనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నారు.

తాజా వార్తలు