శ్రీహరి ప్రధాన పాత్రలో రానున్న “బకరా”

శ్రీహరి ప్రధాన పాత్రలో రానున్న “బకరా”

Published on Sep 26, 2012 3:14 PM IST


శ్రీహరి,నవీన్ మరియు యాశిక్ ప్రధాన పాత్రలలో “బకరా” అనే పేరుతో ఒక చిత్రం రానుంది. ఏ కోటేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సి ఎస్ ఆర్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో చిత్రీకరణ మొదలు పెట్టుకుంది. ఇందులో శ్రీహరి వైవిధ్యమయిన పాత్రలో కనిపించనున్నారు.ఒక సామాన్యుడు కోందరు వ్యక్తుల వల్ల ఏ విధంగా మోసపోతున్నాడు అన్న అంశం మీద ఈ చిత్ర కథ నడుస్తుంది. ఈ చిత్రంలో శ్రీహరి మాఫియా డాన్ గా కనిపించిననున్నారు. రోహిత్ కులకర్ణి ఈ చిత్రానికి సంగీతం అందించగా విజయశ్రీ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, అలీ, ఎం ఎస్ నారాయణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.

తాజా వార్తలు