మంచు విష్ణు తన రాబోయే సినిమా ‘దేనికైనా రెడీ’తో కేరళ మార్కెట్ పై దాడి చెయ్యడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. మలయాళంలోకి డబ్ చేస్తున్న ఈ సినిమాని తెలుగు మరియు మలయాళంలో ఒకేసారి అక్టోబర్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాని డా. మోహన్ బాబు నిర్మాణ సంస్థలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. హన్షిక కథానాయిక నటించిన ఈ చిత్రానికి జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా మలయాళం రిలీజ్ పై విష్ణు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విష్ణు మాట్లాడుతూ ‘ మళయాళ వర్షన్లో ‘దేనికైనా రెడీ’ పాటలు చాలా బాగుంటాయి. ప్రస్తుతం డబ్బింగ్ చివరి దశలో ఉంది. దైవ నిలయాలకు ప్రసిద్ది గాంచిన రాష్టంలో విడుదలకబోతున్న ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మలయాళంలో మంచి విజయం అందుకుంటుందని మరియు మలయాళీల హృదయానికి హత్తుకుంటుందని నమ్మకం ఉందని’ ఆయన అన్నారు. ఈ చిత్ర మళయాళ ఆడియో రిలీజ్ వేడుక అక్టోబర్ మొదటి వారంలో కొచ్చిలో జరగనుంది.