వెంకీ – మహేష్ ల సినిమాకి రామాయణంతో ఉన్న కనెక్షన్?

వెంకీ – మహేష్ ల సినిమాకి రామాయణంతో ఉన్న కనెక్షన్?

Published on Sep 26, 2012 2:50 PM IST


ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అని చెప్పడంలో ఎంతమాత్రం అనుమానం లేదు. అభిమానులు మాత్రమే కాకుండా మరియు సాధారణ ప్రేక్షకులు కూడా విక్టరీ వెంకటేష్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉండబోతోందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి రామాయణంతో సంబందం ఉంది. ఇంతకీ ఏంటది అని అనుకుంటున్నారా? అదేందో దిల్ రాజు మాటల్లోనే విందామా ‘ రాముడికి – రావణుడికి మధ్య జరిగిన యుద్ధం ఒక్కటే రామాయణం కాదు, సీత పడిన కష్టాలు, అన్న కోసం పరితపించే లక్ష్మణుడు, వీరందరి కోసం ఏమన్నా చేయడానికి సిద్దపడే హనుమంతుడు గురించి కూడా ఎంతో ఉంది. అలానే ఈ సినిమాలో కూడా రామ-లక్ష్మణుల మాదిరిగానే అన్నాదమ్ముల సంబంధం ఉంటుంది. దానితో పాటు కుటుంబంలో ఉన్న సంబంద బాందవ్యాల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఇది ప్రేక్షకుల మనసును హత్తుకునే కథ అని ఆయన అన్నారు.

వెంకటేష్ కి జోడీగా అంజలి నటిస్తుండగా, మహేష్ బాబుకి జోడీగా సమంత నటిస్తోంది. వెంకటేష్ మరియు మహేష్ బాబు తల్లి తండ్రులుగా ప్రకాష్ రాజ్ మరియు జయసుధ నటిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ అద్భుతమైన దృశ్యకావ్యానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

తాజా వార్తలు