శిరిడి సాయి నిర్మించడం నా అదృష్టం :మహేశ్వర్ రెడ్డి

శిరిడి సాయి నిర్మించడం నా అదృష్టం :మహేశ్వర్ రెడ్డి

Published on Sep 25, 2012 5:00 PM IST


నాగార్జున సాయి బాబాగా నటించిన శిరిడి సాయి ఇటీవలే విడుదలై కమర్షియల్ గా ఎలా ఉన్నప్పటికీ విమర్శకులతో పాటుగా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి తన ఆనందాన్ని పంచుకోవడానికి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేయగా అయన మాట్లాడుతూ ‘శిరిడి సాయి సినిమా కోసం నేను పెట్టిన ఖర్చు రెండు రోజుల్లోనే తిరిగి వచ్చింది. వ్యాపారాల్లో ఉన్న మేము బాబా భక్తులం. బాబా తత్వాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని నిర్మించాను. చిరంజీవి గారు ఈ సినిమా చూసి అభినందించడం ఆనందంగా ఉంది. నాగార్జున గారు ఈ సినిమా చేసినన్ని రోజులు నన్ను ఒక నిర్మాతగా కాకుండా స్నేహితుడిలా చూసారు. ఇటీవల్ నిర్వహించిన విజయ యాత్రలో మంచి స్పందన లభించింది. విజయ యాత్ర అంతా ఒక పండుగ లాగ అనిపించింది అని అయన అన్నారు.

తాజా వార్తలు