రాంబాబు సినిమాకి గుమ్మడికాయ కొట్టారు

రాంబాబు సినిమాకి గుమ్మడికాయ కొట్టారు

Published on Sep 25, 2012 5:00 PM IST


సినిమా చిత్రీకరణ చివరి రోజు గుమ్మడికాయ కొట్టడం టాలీవుడ్ యొక్క సాంప్రదాయం. మమల్ని ఫాలో అయ్యే పాఠకులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి సంబంధించి అన్ని షూటింగ్ కార్యక్రమాలు పూర్తవడంతో నిన్న సాయంత్రం ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దాదాపు పది సంవత్సరాల తర్వాత పూరి – పవన్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో రేపు నేరుగా మార్కెట్ లోకి విడుదల కానుంది. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాకి అక్టోబర్ 18న రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు