14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రేమ కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మొదట ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న తాజా హాట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో కాజల్ బదులు వేరే హీరొయిన్ నటించనుందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబందించిన కారణం ఏంటనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతం సినీ ప్రేమికులు మరియు ఇండస్ట్రీ వర్గాలు కాజల్ స్థానంలో ఏ హీరొయిన్ నటించనుందా? అని ఆలోచనలో పడ్డారు.
కొంత మంది మాత్రం మిల్క్ బ్యూటీ తమన్నా నటించనుందని అంటున్నారు, ఒక వేల ఇది కార్యరూపం దాలిస్తే ఒక మంచి కాంబినేషన్ అవుతుంది. అలాగే కొంత మంది కొత్త హీరొయిన్ కోసం అన్వేషిస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ విషయం గురించి ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు మరియు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు.