ఈగ హిందీ ఫస్ట్ లుక్ కి అశేష స్పందన

ఈగ హిందీ ఫస్ట్ లుక్ కి అశేష స్పందన

Published on Sep 23, 2012 11:48 AM IST


దక్షిణాదిన ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న ఎస్ ఎస్ రాజమౌళి గ్రాఫిక్ మాయాజాలం “ఈగ” బాలివుడ్లో “మక్కి”గా రానుంది. ఈ చిత్రం హిందీ వెర్షన్ ఫస్ట్ లుక్ ఈ మధ్యనే విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ కి అన్ని చోట్ల నుండి అద్భుత స్పందన వచ్చింది. “మక్కి” చిత్రాన్ని బాలివుడ్ మీడియా చాలా బాగా ప్రమోట్ చేస్తుంది ఈ చిత్రాన్ని మిస్ అవ్వకుండా చూడాలని ప్రముఖులు సలహాలు ఇస్తున్నారు కూడా. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంతో పాటే హిందీలో విడుదల కావలసింది కాని కాస్త ఆలస్యమయ్యింది. ఎస్ ఎస్ రాజమౌళి బాలివుడ్ ఆరంగేట్రానికి సమయం దగ్గర పడింది. “మక్కి” చిత్రం అక్టోబర్ 12న బాలివుడ్ లో విడుదల కానుంది.

తాజా వార్తలు