కన్నుల పండుగ కానున్న రామ్ చరణ్ “నాయక్”

కన్నుల పండుగ కానున్న రామ్ చరణ్ “నాయక్”

Published on Sep 23, 2012 2:29 AM IST


రామ్ చరణ్ రాబోతున్న చిత్రం “నాయక్” ఇటు అభిమానులకు అటు సిని ప్రేమికులకు కన్నుల పండుగ కానుంది.ఈ చిత్రంలో పలు అందమయిన ప్రదేశాలను మరింత అందంగా కెమెరాలో బంధించి చూపించనున్నారు. రామ్ చరణ్ మరియు అమల పాల్ మీద తెరకెక్కించిన “శుభలేఖ రాసుకున్న” పాటను తొలిసారిగా స్లోవేనియాలో చిత్రీకరించారు. స్లోవేనియాలో చిత్రీకరించబడిన తొలి భారతీయ చిత్రం “నాయక్” ఇప్పటి వరకు స్విట్జర్లాండ్ కి మాత్రమే మన చిత్రాలు పరిమితమయ్యాయి. కొన్నాళ్ళయ్యాక కొంతమంది దర్శకులు ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు గ్రీస్ వంటి దేశాలకు వెళ్ళారు. ప్రస్తుతం “నాయక్” చిత్ర బృందం మరో అడుగు ముందేసి స్లోవేనియాలో చిత్రీకరణ జరిపారు. వి వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి వి వి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2013 సంక్రాంతికి విడుదల చెయ్యనున్నారు.

తాజా వార్తలు