బాలీవుడ్లో మరో భారీ సినిమా చేయబోతున్న తమన్నా

బాలీవుడ్లో మరో భారీ సినిమా చేయబోతున్న తమన్నా

Published on Sep 22, 2012 2:52 PM IST


టాలీవుడ్లో టాప్ హీరొయిన్ గా ఎదిగిన తమన్నా మెల్లిగా బాలీవుడ్లో కూడా టాప్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటుంది. అజయ్ దేవగన్ సరసన హిమ్మత్ వాలా అనే సినిమాలో నటిస్తున్న తమన్నా మరో భారీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. తమిళ్లో విజయ్ కాంత్ నటించిన రమణ సినిమా తెలుగులో చిరంజీవి ఠాగూర్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రియ నటించింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేయబోతున్నట్లు సమాచారం. అక్షయ్ కుమార్ హీరోగా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో తమన్నా హీరొయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. తెలుగులో వివి వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని హిందీలో జయం రవి డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

తాజా వార్తలు