రెండు కొత్త చిత్రాలను ఒప్పుకున్న మంచు మనోజ్

రెండు కొత్త చిత్రాలను ఒప్పుకున్న మంచు మనోజ్

Published on Sep 21, 2012 6:06 PM IST


రెండు కొత్త కమర్షియల్ చిత్రాలను ఒప్పుకున్నట్టు మంచు మనోజ్ ప్రకటించారు. ఈ మధ్యనే ఆయన చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా?” విడుదల తరువాత ఆయన కొద్ది రోజుల పాటు విరామం తీసుకున్నారు. అయన తిరిగి జిం లో షేప్ కోసం కసరత్తు మొదలు పెట్టారు. అభిమానులకు కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అయన ఇప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలలో ఎటువంటి ప్రయోగం లేదని పక్కా కమర్షియల్ చిత్రాలని అన్నారు. అయన చేసే ప్రయోగాలు ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అయన చేసే స్టంట్స్ తో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నారు. వైవిధ్యమయిన పాత్రలు కూడా అయన ప్రేక్షకులకు చేరువ అవడానికి మరో కారణం. చూస్తుంటే అయన బాక్స్ ఆఫీస్ వద్ద ఒక విజయాన్ని నమోదు చెయ్యాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాల గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

తాజా వార్తలు