కామెడీ సన్నివేశాల చిత్రీకరణలో ఎన్టీఆర్ ‘బాద్షా’

కామెడీ సన్నివేశాల చిత్రీకరణలో ఎన్టీఆర్ ‘బాద్షా’

Published on Sep 20, 2012 10:58 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త లుక్ తో రాబోతున్న ‘బాద్షా’ ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంభందించిన ఇంపార్టెంట్ కామెడీ సీన్స్ ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఎమ్.ఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, కాజల్ మీద కొన్ని సన్నివేశాలు బుధవారం చిత్రీకరించారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ నుండి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అవి ఈ సినిమాలో ఉంటాయి. ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ కూడా బావుంది. ఎన్టీఆర్ హీరోయిజం ఈ సినిమాలో మెయిన్ హైలెట్ అవుతుంది. ఇటీవల విదేశాల్లో తీసిన సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు. ఈ నెల 24 న దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజు సందర్భంగా బాద్షా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు