అమలపాల్ ని ఇబ్బంది పెడుతున్న పుకార్లు

అమలపాల్ ని ఇబ్బంది పెడుతున్న పుకార్లు

Published on Sep 19, 2012 7:56 PM IST


నూతన లుక్ కోసం జిం కి వెళ్ళడం మొదలు పెట్టినప్పటి నుండి అమల పాల్ హెడ్ లైన్స్ లో ఉంటుంది. అందులోనూ చెన్నై పత్రికలలో ఆమె గురించి ఎక్కువగా రాస్తున్నారు. తన నూతన లుక్ కోసం ఆమె ప్రత్యేకంగా ఒక ట్రైనర్ ని కూడా నియమించుకున్నారు. ఆమె ఫోటో తో పాటు ఒక పత్రికలో ప్రచురితమయిన ఆర్టికల్ చుసిన అమలాపాల్ దిగ్భ్రాంతి చెందారు. ఈ ఆర్టికల్ లో అమల పాల్ ఒక తెలుగు చిత్రం కోసం నూతన లుక్ కోసం ప్రయత్నిస్తున్నారని దర్శకుడు అడిగినందునే ఇలా చేస్తున్నారని ప్రచురించారు. తెలుగులో ఇది అత్యంత వేచి చూస్తున్న చిత్రంగా కూడా ప్రకటించింది ఇది చదివిన అమలా పాల్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. “విలేఖరులు వాళ్ళు రాసే వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకొని రాస్తే మంచిది. ఆ వార్త చూశాక చాలా భాధగా అనిపించింది నేను తెర మీద నటిస్తాను కాని జీవితంలో కాదు” అని అన్నారు. త్వరలో ఈ భామ రామ్ చరణ్ “నాయక్” మరియు పూరి జగన్నాథ్,అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న “ఇద్దరు అమ్మాయిలతో” మరియు సముద్రఖని “జెండా పై కపిరాజు” చిత్రంలో కనిపించనుంది.

తాజా వార్తలు