సూర్యతో జతకట్టనున్న సమంత?

సూర్యతో జతకట్టనున్న సమంత?

Published on Sep 19, 2012 6:25 PM IST


“నాన్ ఈ” తమిళనాడులో భారీ విజయం సాదించినప్పటి నుండి అందరి కళ్ళు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించిన సమంత మీదనే ఉంది. తాజా సమాచారం ప్రకారం దర్శకుడు లింగుస్వామి సూర్యతో తన రాబోతున్న చిత్రం కోసం సమంతను సంప్రదించినట్టు తెలుస్తుంది. సమంత ఈ చిత్రానికి ఇంకా సంతకం చెయ్యకపోయినా ఈ చిత్రాన్ని తను నో చెప్పదు అని అంటున్నారు. సూర్య దక్షిణాదిన ఒకానొక ప్రముఖ హీరో. అధికారిక ప్రకటన త్వరలో చెయ్యనున్నారు. తెలుగులో సమంత ప్రముఖ కథానాయికే అయినా తమిళంలో ఇంతవరకు విజయాన్ని నమోదు చెయ్యలేదు.తన మొదటి విజయం “నాన్ ఈ” చిత్రం. తన తరువాత చిత్రం “నీథానే ఎం పోన్వసంతం” ఈ ఏడాది అత్యంత వేచి చూస్తున్న చిత్రాలలో ఒకటి కావడం ఈ నటికి కలిసి వచ్చిన అంశాలు. ఈ నటి మణిరత్నం “కడల్” మరియు శంకర్ “ఐ” చిత్రాల నుండి బయటకి వచ్చేయటం జరిగింది. ఇది ఆమె కెరీర్ కి ఎటువంటి అడ్డంకి కలిగించలేదు. ఈ మధ్యనే ఏ ఎల్ విజయ్ తన తరువాతి చిత్రంలో విజయ్ సరసన నటించమని అడిగారు ఇప్పుడు లింగు స్వామి. ఇది కాకుండా ఈ నటి వంశీ పైడిపల్లి “ఎవడు” చిత్రంలో నందిని రెడ్డి దర్శకత్వంలో చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు