రాజమండ్రిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న కో అంటే కోటి బృందం

రాజమండ్రిలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న కో అంటే కోటి బృందం

Published on Sep 19, 2012 4:00 PM IST


“కో అంటే కోటి” చిత్రం రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. క్లైమాక్స్ తో సహా పలు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించారు. శర్వానంద్ మరియు ప్రియ ఆనంద్ ఈ క్రైం డ్రామాలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా శ్రీహరి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. “ఆవకాయ బిర్యాని” చిత్రానికి దర్శకత్వం వహించిన అనిష్ యోహన్ కురువిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి స్పందన సంపాదించుకుంది. శర్వానంద్ మరియు అనిష్ కురువిల్ల రోమాన్స్ మరియు సెంటిమెంట్ తో కూడా ఒక చిత్రాన్ని చేస్తున్నట్టు బలమయిన సంకేతాలను ఈ ఫస్ట్ లుక్ అందిస్తుంది. ఈ చిత్రం గురించి మరినిన్ విశేషాలను త్వరలో వెల్లడిస్తారు .

తాజా వార్తలు