నేను చిత్రాలను చేసేది డబ్బుల కోసమే :ఇలియానా

నేను చిత్రాలను చేసేది డబ్బుల కోసమే :ఇలియానా

Published on Sep 19, 2012 11:03 AM IST


సినీపరిశ్రమలో నటులు భారీ పారితోషకం తీసుకుంటారు అన్న విషయం చాలామందికి తెలిసిందే కాని అందులో కొంతమంది మాత్రమే ఈ విషయాన్నీ బహిరంగంగా ప్రకటిస్తారు. నటనను కెరీర్ గా తీసుకోవడానికి పారితోషకం కారణం అన్న మాట కూడా మనకి వినిపించడం చాలా అరుదు కాని గోవా భామ ఇలియానా మాత్రం ఇందుకు విభిన్నంగా తను పరిశ్రమలోకి వచ్చినది డబ్బు కోసమే అని అన్నారు.

“చాలా మంది వాళ్ళ సంతృప్తి కోసం నటిస్తున్నాను అని చెప్తారు. నాకు డబ్బు విలువ తెలుసు కాబట్టి నేను అలా చెప్పను నేను ఈ నటనను కెరీర్ గా ఎంచుకోడానికి ముఖ్య కారణం డబ్బు కాబట్టే అది నాకు చాలా ముఖ్యం” అని ఇలియానా అన్నారు.

ఇలియానా ఈ మధ్యనే బాలివుడ్ లో “బర్ఫీ” అనే చిత్రంలో నటించింది. అక్కడ విమర్శకుల ప్రశంసలను పొందింది ప్రస్తుతం అటువైపుగా అడుగులు వెయ్యటం మీద దృష్టి సారించింది. డబ్బులు కోసం నటించడం సరయినదే కాని పని మీద కాస్త ప్రేమ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడం అనే విషయాలని కూడ మనసులో పెట్టుకోవాలి కదా? ఈ ప్రశ్నకి ఇలియానాకి త్వరలోనే సమాధానం తెలుస్తుందేమో .

తాజా వార్తలు