అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపనున్న త్రివిక్రమ్,మహేష్ బాబు

అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణ జరుపనున్న త్రివిక్రమ్,మహేష్ బాబు

Published on Sep 17, 2012 9:00 PM IST


మహీంద్రా కో వారికి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు చేస్తున్నారని గతంలోనే మేము తెలిపాము. మహీంద్రా కో వారికి ఒక నూతన యాడ్ ని మహేష్ బాబు మీద త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. దీని చిత్రీకరణ కొద్ది రోజుల క్రితమే మొదలయ్యింది తాజా సమాచారం ప్రకారం రేపటి నుండి ఈ యాడ్ చిత్రీకరణ అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్, హైదరాబాద్లో జరుపుకోనుంది. దక్షిణాదిన అత్యధిక ప్రాడక్ట్స్ కి బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్న ఏకైక హీరో మహేష్ బాబు . ప్రపంచలో ప్రధాన కంపెనీ అయిన మహీంద్రా కో వారు మహేష్ బాబు ని అంబాసడర్ గా ఎంచుకోవడం ఆయన స్టార్ పవర్ ఏంటో తెలుస్తుంది. ఇప్పటికే అయన థమ్స్ అప్, ఐడియా, జోస్ అల్లుకాస్, వివెల్ మరియు సంతూర్ వంటి ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసడర్ గా ఉంటున్నారు. ఈ చిత్రీకరణ తరువాత ఆయన సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న చిత్ర చిత్రీకరణలో పాల్గొంటారు. గతంలో “దూకుడు” చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట మరియు గోపిచంద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు