యాక్షన్(3డి) చిత్రంలో నటించనున్న సుదీప్

యాక్షన్(3డి) చిత్రంలో నటించనున్న సుదీప్

Published on Sep 15, 2012 10:40 PM IST


ఎస్ ఎస్ రాజమౌళి “ఈగ” చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన నటుడు సుదీప్. త్వరలో ఈ నటుడు అనిల్ సుంకర చిత్రం “యాక్షన్(3డి)” లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో అల్లరి నరేష్, వైభవ రెడ్డి, రాజు సుందరం, శ్యాం, స్నేహ ఉల్లాల్, కామ్నా జెత్మలాని మరియు నీలం ఉపాధ్యాయ్ లు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. సుదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నారని అనిల్ సుంకర దృవీకరించారు. “సుదీప్ ఈరోజు “యాక్షన్” చిత్ర చిత్రీకరణలో పాల్గొన్నారు. గొప్ప నటుడితో పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది” అని అనిల్ సుంకర ట్వీట్ చేశారు. గత కొన్ని రోజులుగా సుదీప్ తెలుగు మరియు తమిళంలో చిత్ర కథలు వింటున్నారు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఈ చిత్రానికి బప్పా లహరి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక పాటను రాఘవేంద్ర రావు శైలిలో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో చాలా భాగం చిత్రీకరణ పూర్తయిపోయింది .

తాజా వార్తలు