సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల తేదీని ఖరారు చేసిన దిల్ రాజు

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు విడుదల తేదీని ఖరారు చేసిన దిల్ రాజు

Published on Sep 15, 2012 11:24 AM IST


విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఆన్ స్క్రీన్ మీద అన్నదమ్ములుగా తెరకెక్కుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్ర విడుదల తేదీని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయబోతున్నట్లు దిల్ రాజు చెప్పారు. ఇటీవలే చెన్నై షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు 78 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా ఇంకా 30 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. నవంబర్ 15 వరకు మొత్తం షూటింగ్ పూర్తి చేసి అదే నెల మూడవ వారంలో ఆడియోని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు అయన తెలిపారు.

తాజా వార్తలు