“కో అంటే కోటి” చిత్ర టీజర్ కి అనూహ్య స్పందన

“కో అంటే కోటి” చిత్ర టీజర్ కి అనూహ్య స్పందన

Published on Sep 14, 2012 12:02 PM IST


శర్వానంద్ రాబోతున్న చిత్రం “కో అంటే కోటి” చిత్ర టీజర్ కి అద్భుతమయిన స్పందన వచ్చింది. ఈ టీజర్లో మొదటి డైలాగ్ “బ్రతకాలి అంటే బలుపు కావాలి అది నా దగ్గర చాలా ఉంది” జనాన్ని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ టీజర్ లో వినిపించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ చాలా విభిన్నంగా ఉంటూ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్రంలో శ్రీ హరి కీలక పాత్ర పోషిస్తుండగా ప్రియ ఆనంద్ కథానాయికగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షెడ్యూల్ రాజమండ్రిలో జరుపుకుంటుంది. కొద్ది రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది.ఈ చిత్రం గురించి ప్రియ ఆనంద్ మాట్లాడుతూ “నేను చేసిన చిత్రాలలో ఇదే ఉత్తమం నా కెరీర్లో ఇది చాలా ప్రత్యేకమయిన పాత్రగా నిలిచిపోతుంది. ఇంతకు మించి నేను ఏమి చెప్పకూడదు. కాని శర్వానంద్ మరియు అనిష్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాని మాత్రం చెప్పగలను” అని అన్నారు. అనీష్ కురువిల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ స్వయాన నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

క్లిక్ చేయండి ట్రైలర్  కొరకు

 

తాజా వార్తలు