ఈ రోజుల్లో ఆడియోకి రానున్న అల్లు అర్జున్

ఈ రోజుల్లో ఆడియోకి రానున్న అల్లు అర్జున్

Published on Feb 6, 2012 2:15 PM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ఈ రోజుల్లో’ ఆడియో వేడుకకి ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ చిత్ర నిర్మాత అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు కావడంతో ఈ వేడుకకి రానున్నారు. ఈ నెల 9న శిల్పారామంలో ఈ వేడుక జరగనుంది, మారుతి అనే దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని గుడ్ ఫ్రెండ్స్ సంస్థ నిర్మిస్తుంది. శ్రీ మరియు రేష్మా ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ చిత్రానికి జెబి సంగీతం అందించారు.

తాజా వార్తలు