
గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతో ఇటీవల టాలీవుడ్ ని గమనిస్తే స్పష్టంగా ఒక విషయం అర్ధమవుతుంది. మన తెలుగు హీరోలకు హీరోయిన్ల కొరత ఏర్పడింది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, పవన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, నాగ చైతన్య, రానా, మరియు ప్రభాస్ అలాగే నాగార్జున, బాలయ్య, వెంకటేష్ మొత్తం ౧౨ మంది హీరోలు ఉండగా వీరి సరసన నటించే హీరోయిన్లు ౯ మంది మాత్రమే ఉన్నారు. కాజల్, తమన్నా, సమంతా, ఇలియానా వీరు నలుగురు అగ్ర కథానాయికలుగా చెలామణి అవుతుండగా అనుష్క, రిచా, అమలా పాల్, నయనతార మరియు తాప్సీ వీరు తరువాతి వరుసలో ఉన్నారు. ఇండస్ట్రీ నుండి దాదాపుగా 150 సినిమాలు వస్తుంటాయి. అగ్ర హీరోలు నటించే సినిమాలు 25 వరకు ఉంటాయి. అంటే దాదాపు ఒక హీరొయిన్ సంవత్సరానికి గాను మూడు సినిమాల వరకు చేయాలి. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి బాగా డిమాండ్ ఉందని ఇలియానా అన్నారు. అగ్ర కథానాయికలందరూ కోటి రూపాయల పై రేమ్యూరేషణ్ తీసుకుంటున్నారు. త్వరలో హీరోయిన్ల కొరత తీరాలని ఆశిద్దాం.

