సిటీలలో స్నేహితుడుకి మంచి ఆదరణ

సిటీలలో స్నేహితుడుకి మంచి ఆదరణ

Published on Jan 27, 2012 3:24 PM IST


శంకర్ డైరెక్షన్లో విజయ్, ఇలియానా, జీవా మరియు శ్రీరామ్ ముఖ్య పాత్రల్లో నటించిన యూత్ కాలేజ్ డ్రామా చిత్రం ‘స్నేహితుడు’. ఏ సెంటర్స్ లో, మరియు బి సెంటర్స్ లోని కొన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తుంది. హిందీలో సూపర్ హిట్ అయిన ‘3 ఇడియట్స్’ చిత్రాన్ని తమిళ్లో ‘నన్బన్’ పేరుతో రిమేక్ చేసారు. అదే చిత్రాన్ని తెలుగులో స్నేహితుడు పేరుతో డబ్ చేసారు.

ఇలియానా, శ్రీరామ్ మరియు జీవా తెలుగు వారికి బాగా పరిచయమున్న నటులు కావడం, సునీల్ మెయిన్ కమెడియన్ కి డబ్బింగ్ చెప్పి నవ్వించడం బాగా కలిసి వచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం మరియు విజయవాడ సిటీలో ఉండే స్టూడెంట్స్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్ కి కనెక్ట్ కావడంతో సినిమాని బాగా ఆదరిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్ర తెలుగు పంపిణీ హక్కులు దక్కించుకున్నారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించగా అబ్బూరి రవి డైలాగులు రాసారు.

తాజా వార్తలు