నా ఇష్టం కోసం డబ్బింగ్ చెబుతున్న రానా

నా ఇష్టం కోసం డబ్బింగ్ చెబుతున్న రానా

Published on Jan 27, 2012 8:27 AM IST

యువ నటుడు రానా తన తరువాత చిత్రం ‘నా ఇష్టం’ కోసం ఈ రోజు నుండి డబ్బింగ్ చెప్పనున్నారు. ఇటీవలే ‘కృష్ణం వందే జగద్గురుం’ షెడ్యుల్ పూర్తి చేసుకొని నా ఇష్టం చిత్రం కోసం పాల్గొంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రకాష్ తోలేటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రంలో రానా సరసన జెనీలియా ‘కృష్ణవేణి’ పాత్రలో నటిస్తుంది. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తుండగా అలీ, సుబ్బరాజు, రఘుబాబు, ప్రగతి మరియు ఇతర సీనియర్ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.

తాజా వార్తలు