హీరోయిజం చూపించి ట్రెండ్‌సెట్టర్ చేయడంలో పూరి జగన్నాధ్ దిట్ట. చాలా మంది దర్శకులు కథను నమ్ముకుంటే, పూరీ మాత్రం కథతో పాటు తన కథలో హీరోని మరియు ఆ హీరో పాత్ర మలిచే విధానం మీదే దృష్టి పెడతాడు. గతంలో రవితేజతో తీసిన ‘ఇడియట్’ చిత్రంలో రవితేజ పాత్ర మలిచిన తీరుకి మాస్ ఫ్యాన్స్ తో పాటు లేడి ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నారు. మహేష్ బాబుతో తీసిన ‘పోకిరి’ తీసి హీరోయిజం చూపించడంలో కొత్త స్టైల్ చూపించారు. మళ్లీ అదే కాంబినేషన్లో వచ్చిన ‘బిజినెస్ మేన్’ లో కూడా మహేష్ పాత్ర అదేలా డిజైన్ చేసి ప్రేక్షకుల శెభాష్ అనిపించుకున్నారు. బిజినెస్ మేన్ ఇటీవలే విడుదలై విజవంతంగా నడుస్తుండటంతో మహేష్ చాలా ఆనందంగా ఉన్నారు. బిజినెస్ మేన్ లాంటి పెద్ద హిట్ ఇచ్చినందుకు పూరీ జగన్ కు ధన్యవాదాలు అంటూ తన ట్విట్టర్ ఎకౌంటులో తెలిపారు.
ప్రతీ హీరోకు ఇష్టమైన దర్శకుడు పూరీ
ప్రతీ హీరోకు ఇష్టమైన దర్శకుడు పూరీ
Published on Jan 16, 2012 1:15 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- పిక్ ఆఫ్ ది డే: ‘ఉస్తాద్’ ని కలిసిన ‘కింగ్డమ్’ టీం.. లుక్స్ అదుర్స్
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- బుకింగ్స్ లో దుమ్ము లేపిన ‘కింగ్డమ్’
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- అజిత్ తో సినిమాపై లోకేష్ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్!